ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 16:51:19

సింగరేణి ఉద్యోగులకు రూ.15 వేలు తగ్గకుండా చర్యలు

సింగరేణి ఉద్యోగులకు రూ.15 వేలు తగ్గకుండా చర్యలు

హైదరాబాద్:  సింగరేణి ఉద్యోగులకు కనీస జీతం 15 వేలు తగ్గకుండా యాజమాన్యం చర్యలు చేపట్టింది. సంస్థలో పనిచేసే 27 వేల మందికి రూ.15 వేల పైగానే జీతం ఉంది. 4వ తేదీన ఉద్యోగుల అక్కౌంట్లలోకి జీతాలు జమ చేయనున్నట్లు తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి, సంబంధిత పరిస్థితుల నేపధ్యంలో సింగరేణిలో ఉద్యోగులకు మార్చి నెల జీతంలో సగం వేతనం చెల్లించాలని, మిగిలిన సగం తర్వాత చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించి ఆదేశాలు జారీచేసింది.  మార్చి నెల జీతం చెల్లింపుపై ఉన్న ఆదేశాలను యధాతథంగా అమలు చేస్తే సుమారు 13,650 మంది ఉద్యోగులకు 15 వేల రూపాయల కన్నా తక్కువ జీతం వచ్చే అవకాశం ఉన్నందున యాజమాన్యం ఈ ఉద్యోగుల ప్రయోజనం కోసం కొన్ని సవరణలు చేసి మార్చి నెల చేతికందే జీతం 15 వేలకన్నా తక్కువ ఉండకుండా చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు బదిలీ వర్కర్లకు కూడా ఇలాగే చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటికే మార్చి నెల జీతంలో పండగ అడ్వాన్సు, కో-ఆపరేటివ్ సొసైటీ లోన్ రికవరీలు, క్లబ్బుల రికవరీలు వంటి కటింగులను వాయిదా వేస్తూ ఇటీవల కంపెనీ ఒక సర్కులర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఉద్యోగులకు ఈ విషయంలో కొంత ఊరట కలగనుంది. 


logo