బుధవారం 03 జూన్ 2020
Telangana - May 06, 2020 , 18:44:18

సీఎం సహాయ నిధికి సింగరేణి రూ.40 కోట్ల విరాళం

సీఎం సహాయ నిధికి సింగరేణి రూ.40 కోట్ల విరాళం

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం  కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలకు  విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. ఆపత్కాలంలో మేము సైతం అండగా ఉంటామంటూ దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా  సింగరేణి సంస్థ సీఎండీ  ఎన్ శ్రీధర్  సీఎం కేఆసీర్‌ను కలిసి రూ.40 కోట్ల విరాళం చెక్కును  ప్రగతి భవన్ లో అందజేశారు.  ప్రభుత్వానికి తమ వంతు సహకారంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యం  రూ. 40 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.ఈ మేరకు  సంస్థ చైర్మన్ సీఎండీ శ్రీధర్, సింగరేణి కార్మికులు, సిబ్బందిని సీఎం అభినందనలు తెలిపారు.


logo