గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 02:06:38

సింగరేణి డైరెక్టర్‌ రికార్డు

సింగరేణి డైరెక్టర్‌ రికార్డు

  • ఒక్కరోజే 1,006 మొక్కలు నాటిన బలరాం
  • గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా 10 వేలు నాటాలని నిర్ణయం

సీసీసీ నస్పూర్‌: సీఎం కేసీఆర్‌ చేపట్టిన తెలంగాణకు హరితహారం, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ చాలెంజ్‌ ఇండియాకు మద్దతుగా సింగరేణి సంస్థ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌) బలరాం శనివారం ఒక్కరోజే 1,006 మొక్కలు నాటి రికార్డు నెలకొల్పా రు. సింగరేణివ్యాప్తంగా 10 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకు న్న బలరాం ఇదివరకు శ్రీరాంపూర్‌ ఓసీపీ ఓబీపై ఏకంగా 1,250 మొక్క లు నాటగా, శనివారం సీసీసీలో 1,006 మొక్కలు నాటారు. శనివారం నాటిక ఆయన నాటిన మొక్కలు 9,006కు చేరుకున్నాయి. కాగా దేశంలో ఏ సివిల్‌ సర్వీస్‌ అధికారి ఇప్పటివరకు సాధించని ఘనతను సింగరేణి డైరెక్టర్‌ బలరాం సాధించి చరిత్ర పుటల్లో నిలిచిపోతారని పలువురు పేర్కొన్నారు.


logo