శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Dec 01, 2019 ,

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్

హైదరాబాద్: సింగరేణి సంస్థ డైరెక్టర్(ఆపరేషన్) చంద్రశేఖర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని నేడు మొక్కలు నాటారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను చంద్రశేఖర్ స్వీకరించారు. ఆర్టీ - 1 బంగ్లాస్ ఏరియా పార్కులో ఆయన ఈ ఉదయం మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ స్పందిస్తూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కాన్సెప్ట్‌ను ప్రారంభించినందుకు సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మరో ముగ్గురికి రామగుండం కమీషనర్ సత్యనారాయణ, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, ఆర్జీ-1 జి.యం. విజయ పాల్ రెడ్డిలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో సివిల్ డిజిఎం నవీన్ గారు, సింగరేణి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

logo