గురువారం 04 జూన్ 2020
Telangana - May 12, 2020 , 16:59:29

బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి సీఎండీ శ్రీధర్‌ సమీక్ష

బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి సీఎండీ శ్రీధర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : వర్షాకాలం, కరోనా పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి సీఎండీ శ్రీధర్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ... పరిశ్రమలు ప్రారంభమైతే తగినంత బొగ్గు ఉత్పత్తికి సింగరేణి సిద్ధంగా ఉండాలన్నారు. కార్మికులు తగిన జాగ్రత్తలతో విధులు నిర్వహించాలని కోరారు. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి సజావుగా నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


logo