e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home తెలంగాణ డాటా సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్‌ కంపెనీలు

డాటా సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్‌ కంపెనీలు

డాటా సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్‌ కంపెనీలు
  • సింగపూర్‌ హై కమిషనర్‌ సైమన్‌వాంగ్‌ వెల్లడి
  • మంత్రి హరీశ్‌రావుతో మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్‌, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పొరేట్‌ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయ ని సింగపూర్‌ హైకమిషనర్‌ సైమన్‌వాంగ్‌ తెలిపా రు. ఆ దేశ ప్రతినిధుల బృందంతో కలిసి సోమవా రం ఆయన అరణ్యభవన్‌లో ఆర్ధికమంత్రి హరీశ్‌స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని హరీశ్‌రావు వివరించారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యంత అనువైన ప్రాం తంగా మారిందని తెలిపారు. అన్ని సౌకర్యాలతో ఫార్మా సిటీని ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఏడాది పొడవునా సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, రహదారులు, ఎయిర్‌పోర్ట్‌, శాంతిభద్రతలతో పెట్టుబడులకు స్వర్గధామమని వివరించారు.

అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కాళేశ్వరం
సింగపూర్‌ ప్రతినిధుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి హరీశ్‌రావును అడిగి తెలుసుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కాళేశ్వరం అని మంత్రి వివరించారు. గోదావరి నీటిని 630 మీటర్ల ఎత్తు వరకు ఈ ప్రాజెక్ట్‌ ద్వారా లిఫ్ట్‌ చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఏడున్నరేండ్లలోనే వ్యవసాయరంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. పట్టణాలు, నగరాలే కాకుండా పల్లెల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చారని వివరించారు. ఈసారి పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ పల్లెలను సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాలు, గ్రామీణుల జీవన విధానాన్ని పరిశీలించాలని, సిద్దిపేట జిల్లాను సందర్శించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సింగపూర్‌ హైకమిషన్‌ సెక్రటరీలు సెన్‌ లిమ్‌, అమండా క్వెక్‌, సింగపూర్‌ కన్సోల్‌ జనరల్‌ (చెన్నై) పాంగ్‌ కాక్‌ టైన్‌, వైస్‌ కన్సోల్‌ జనరల్‌ అబ్రహం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌ హైకమిషన్‌ను మంత్రి హరీశ్‌రావు శాలువా కప్పి, జ్ఞాపికతో సత్కరించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డాటా సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్‌ కంపెనీలు
డాటా సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్‌ కంపెనీలు
డాటా సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్‌ కంపెనీలు

ట్రెండింగ్‌

Advertisement