సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 15:13:07

ఏడుపాయల ఆలయంలో మాయమైన వెండి తొడుగు లభ్యం

ఏడుపాయల ఆలయంలో మాయమైన వెండి తొడుగు లభ్యం

మెదక్‌ : ఏడుపాయల ఆలయంలో మాయమైన వెండి తొడుగు లభ్యమైంది. నిన్న వనదుర్గమ్మ ఆలయంలో గర్భగుడి ద్వారం వెండి తొడుగు మాయమైంది. కాగా మాయమైన ఈ వెండి తొడుగు లడ్డూ ప్రసాదం తయారీ షెడ్డులో లభించింది. చీరలో చుట్టి ఉన్న వెండి తొడుగును షెడ్డులో గుర్తించారు. విచారణలో భాగంగా పోలీసులు ఆలయంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించనున్నారు.