శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 15:18:28

విత్త‌నోత్ప‌త్తి కేంద్రంగా సిద్దిపేట‌! : మ‌ంత్రి హ‌రీష్‌రావు

విత్త‌నోత్ప‌త్తి కేంద్రంగా సిద్దిపేట‌! : మ‌ంత్రి హ‌రీష్‌రావు

సిద్దిపేట : జిల్లా కేంద్రంలో విత్త‌న కంపెనీల ప్ర‌తినిధుల‌తో రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు బుధ‌వారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాను విత్త‌నోత్ప‌త్తి కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామ‌న్నారు. విత్త‌నోత్ప‌త్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. విత్త‌న కంపెనీల ప్ర‌తినిధుల‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. విత్త‌నోత్ప‌త్తి సాగు వ‌ల్ల కంపెనీలు, రైతులు ఇద్ద‌రికీ లాభ‌మే చేకూరుతుంద‌ని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు చేయాల‌నేదే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి హ‌రీష్‌రావు ఉద్ఘాటించారు. 


logo