మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 08:56:17

రూ.7.50 లక్షలు సీజ్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు

రూ.7.50 లక్షలు సీజ్‌ చేసిన ట్రాఫిక్‌ పోలీసులు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల  సందర్భంగా సిద్దిపేట పట్టణం మెదక్ రోడ్ హై స్కూల్ సిద్దిపేట ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.7.50లక్షలు తరలిస్తుండగా సీజ్‌ చేశారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ఆంజనేయులు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. సందర్భంగా పుల్లూరు గ్రామానికి చెందిన చొప్పదండి మణికంఠ తన వాహనంలో రూ.7.50లక్షలు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తుండగా పట్టుకొని సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులను వన్‌ టౌన్‌ సీఐ సైదులు పంచనామా చేసి, కలెక్టరేట్‌లోని జిల్లా ఎన్నికల కార్యాలయంలో డిపాజిట్‌ చేసినట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపి డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి వద్ద రూ.50వేలకు మించి డబ్బులు ఉండవద్దని, అంతకంటే ఎక్కువ ఉంటే డబ్బులు సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యాపారస్తులు లావాదేవీలు ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్ ద్వారా చేసుకోవాలని సూచించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo