e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home Top Slides ధూం..ధాం.. రియల్‌

ధూం..ధాం.. రియల్‌

ధూం..ధాం.. రియల్‌
 • రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరల స్థిరీకరణ.. రియల్‌ ఎస్టేట్‌ కళకళ
 • సగటున ప్రతి 10-15 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షక కేంద్రం
 • సాగునీటి ప్రాజెక్టులతో పడావు భూమికి కళ
 • కలిసొచ్చిన కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు
 • వికేంద్రీకృత అభివృద్ధితో అంతటా డిమాండ్‌
 • రాజధానికి 150కి.మీ. పోయినా 20 లక్షలు!
 • ఫ్లాట్లు, ప్లాట్లలో పెట్టుబడితో అధిక లాభాలు
 • ఆరేండ్లలోనే రెండున్నర రెట్లు పెరిగిన విలువ

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి బయల్దేరితే.. కొద్ది దూరంలో శామీర్‌పేట చెరువు.. జీనోమ్‌వ్యాలీ.. అక్కడికి దగ్గరలోనే పర్యాటక కేంద్రంగా రూపుదాల్చుతున్న జల సోయగాల కొండపోచమ్మ రిజర్వాయర్‌! దానికి దగ్గరలోనే వర్గల్‌ సరస్వతి ఆలయం.. ఆపై హార్టికల్చరల్‌ యూనివర్సిటీ! అక్కడికి దగ్గరలోనే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రం! అది దాటితే.. మల్లన్నసాగర్‌ మహాజలాశయం.. దాన్ని చూసేలోపే పలుకరించే సిద్దిపేట కలెక్టరేట్‌ సముదాయం! ఇలా వెళుతున్న కొద్దీ ప్రతి 15 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షక కేంద్రం! అది పర్యాటకమో.. ఆధ్యాత్మికమో? పంటలకు జీవంపోసే జలాశయమో.. ఏదైతేనేం అన్నీ తెలంగాణలోని జాగలకు విలువను అమాంతం పెంచేసేవే! ఇప్పుడు తెలంగాణలో ఏ ప్రాంతంలో చూసినా రియల్‌ ఎస్టేట్‌ రంగం కళకళలాడుతున్నదంటే.. ఈ ఆకర్షక కేంద్రాల వల్లే. రాజధానికి 150 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతంలో తక్కువలో తక్కువ 20 లక్షలు లేందే ఎకరం కూడా దొరికే పరిస్థితి లేదు!

హైదరాబాద్‌, జూన్‌ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వస్తే ఏమైతది? అని వెక్కిరించినవాళ్లకు.. తెలంగాణ వస్తే ఆగమైతదని లేనిపోని భయాలు సృష్టించినవాళ్లకు చెంప ఛెళ్లుమనిపించేలా రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం అందనంత ఎత్తుకు ఎదిగింది. ప్రతి ఒక్కరూ ఈర్ష్య పడేలా రియల్‌రంగం దేదీప్యమానమైంది. ఆరేండ్లలోనే భూముల ధరలు సగటున రెండున్నర రెట్లు పెరిగాయి. ఈ ట్రెండ్‌ ఒక్క హైదరాబాద్‌కో.. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. మారుమూల గ్రామాలకు సైతం విస్తరించింది. వ్యవసాయ భూములు బంగారంలా మారగా, ప్లాట్లు, ఇండ్లు పెట్టుబడికి కేంద్రాలయ్యాయి. తెలంగాణలో భూమికి అసలైన ధర ఇప్పుడే వస్తున్నది.

పెరుగుదల కాదు స్థిరీకరణ..

- Advertisement -

సీఎం కేసీఆర్‌ పాలనాదక్షత, ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్య వృద్ధిని సాధిస్తున్నది. జాతీయ సగటును మించి ఆర్థికవృద్ధిని నమోదుచేస్తున్నది. ఫలితంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో అడుగుపెడుతున్నాయి. గత ఆరేండ్లలో రాష్ట్ర వ్యవసాయ రంగం ముఖచిత్రం మారిపోయింది. తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణం వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో కనీసం లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి తదితర భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపట్టింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై కొండపోచమ్మసాగర్‌ వరకు గోదారమ్మను మోసుకొచ్చింది. మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు వేయడంతో కనెక్టివిటీ పెరిగింది. ఔటర్‌కు వెలుపల రీజినల్‌ రింగ్‌ రోడ్డు, అన్ని నగరాలు, పట్టణాలకు ఔటర్‌ రింగ్‌రోడ్‌లు నిర్మిస్తుండటం కలిసి వస్తున్నది. పరిశ్రమలను వికేంద్రీకరించింది. ఓవైపు వ్యవసాయం, మరోవైపు వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో భూమి బంగారంతో సమానంగా మారింది. కాబట్టి అదే స్థాయిలో భూముల ధరలు పెరగడం సహజం. పెట్టిన ప్రతి రూపాయికీ కచ్చితంగా ఫలితం వస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. ఈ పరిణామాలతో తెలంగాణలో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. స్థిరంగా ధరలు పెరుగుతూ ఉండటం వల్ల కొనుగోలుదారులకు సైతం వేగంగా లాభాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షక కేంద్రాలు

సాధారణంగా ఎవరైనా భూమి లేదా ఇల్లు కొనే ముందు సమీపంలో ఏదైనా బడి లేదా గుడి లేదా ఇతర పర్యాటక ప్రాంతం, పరిశ్రమ, ప్రభుత్వ కార్యాలయం, హైవే వంటివి ఏమైనా ఉన్నాయేమోనని చూస్తారు. వీటినే పెట్టుబడి ఆకర్షక ప్రాంతాలుగా పిలుస్తారు. గతంలో నగరాలు, పట్టణాల చుట్టూనే ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు తెలంగాణలో ప్రతి 10-15 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షక ప్రాంతం తయారైంది. కొత్తజిల్లా కేంద్రాలు ‘రియల్‌’ కేంద్రాలుగా మారాయి. వెంచర్లు పెరుగుతున్నాయి. సమీకృత కలెక్టరేట్ల చుట్టూ ఉన్న భూములకు, సమీపంలోని గ్రామాలకు డిమాండ్‌ ఏర్పడింది. మరోవైపు సగటున ప్రతి 15 కిలోమీటర్లకు ఒక మండల కేంద్రం తయారైంది. దీంతో ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక గ్రామాల మధ్య లింక్‌ రోడ్లను అభివృద్ధి చేయడం, డబుల్‌ రోడ్లు వేయడం వంటివి కూడా కలిసి వస్తున్నాయి.

ఇండ్లకూ ఫుల్‌ డిమాండ్‌

గతంలో అభివృద్ధి మొత్తం హైదరాబాద్‌ కేంద్రంగా సాగేది. ఇప్పుడు వికేంద్రీకరణ జరుగుతున్నది. మారుమూల ప్రాంతాల్లోనూ భారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం వంటి నగరాలు పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఐటీ రంగం సైతం జిల్లాలకు తరలివెళ్తున్నది. దీంతో ఆయా నగరాలకు వెళ్లే దారులు, వాటి చుట్టూ పదుల కిలోమీటర్ల మేర భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కాళేశ్వరం జలాలు రావడం, చెరువులు బాగుపడటంతో గ్రామాల్లో వ్యవసాయం బాగా పెరిగింది. దీంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు జవసత్వాలు వచ్చి, చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఇండ్లకు డిమాండ్‌ ఊపందుకున్నది. ఇప్పటికే కట్టిన ఇండ్ల ధరలు రెండుమూడురెట్లు పెరుగగా, మరోవైపు కొత్త ఇండ్ల నిర్మాణం జోరు మీదున్నది. ఇతర రాష్ర్టాల కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్న పరిస్థితి. మరోవైపు చిన్న పట్టణాల్లో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి మొదలైంది. పట్టణాలు, వాటికి అనుకొని ఉన్న గ్రామాల్లో అయితే ఏకంగా కొత్త వెంచర్లు, నెలల రోజుల్లోనే కాలనీలు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో భూముల ధరల పెరగుదల ప్రారంభం మాత్రమేనని, ఐదేండ్లలో ఊహించని స్థాయికి చేరుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. సుస్థిర ప్రభుత్వం ఉండటం, సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతుండటం రియల్‌ ఎస్టేట్‌కు ఇంధనంగా మారాయన్నారు. పుణె, చెన్నై వంటి నగరాల్లో వసతులు మనతో పోల్చితే చాలా తక్కువ. అయినా అక్కడ చదరపు అడుగు రూ.8 వేల వరకు అమ్ముతున్నారు. మన దగ్గర గచ్చిబౌలి వంటి ప్రైమ్‌ ప్రాంతాల్లో రూ.6,500-7000కు అమ్ముతుండటం గమనార్హం. మనం ధరల స్థిరీకరణ ప్రారంభ దశలో ఉన్నామని, మరో ఐదేండ్లలో రియల్టీ విస్తరణ మరో దశకు పెరుగుతుందని అంటున్నారు.

వరంగల్‌ హైవే వైపు కూడా ఇదే పరిస్థితి

 • ఇప్పటికే ఔటర్‌ రింగ్‌రోడ్‌, ఘట్‌కేసర్‌ మీదుగా భువనగిరి వరకు భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ రావడం కలిసొచ్చింది.
 • ఆ తర్వాత 16 కి.మీ. దూరంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయం ఉన్నది. ఈ ఆలయంతో జిల్లావ్యాప్తంగా భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
 • భువనగిరి మీదుగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు వెళ్తుండటం మరో ఆకర్షణగా మారింది. భువనగిరిలో వందల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు తరలివస్తుండటంతో కొత్త ఊపు వచ్చింది.
 • యాదాద్రి తర్వాత వచ్చే ఆలేరు మండల కేంద్రం. ఈ పట్టణానికి రోడ్డు, రైలు మార్గాలు ఉండటం కలిసి వస్తున్నది. సమీపంలోని కొలనుపాకలో ప్రసిద్ధ జైన ఆలయం ఉండటంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది.
 • ఆ తర్వాత జనగామ జిల్లా కేంద్రంగా మారడంతో పట్టణం వేగంగా విస్తరిస్తున్నది.
 • హైదరాబాద్‌-వరంగల్‌ మధ్య ఇండస్ట్రియల్‌ కారిడార్‌ రానుండటంతో రియల్‌ రంగం మరింత వృద్ధి చెందనున్నది.
 • యాదాద్రి భువనగిరి జిల్లాను టూరిజం కారిడార్‌గా, జనగామ జిల్లాను ఫుడ్‌ ప్రాసెసింగ్‌, తోలు పరిశ్రమల కేంద్రంగా, వరంగల్‌ను ఐటీ, మెడికల్‌ ఇతర పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో వరంగల్‌ వరకు భూములకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే వరంగల్‌లో ఐటీ పరిశ్రమ విస్తరించగా, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌తో భారీగా పెట్టుబడులు రానుండటం కలిసి వస్తున్నది.
 • మొత్తంగా వరంగల్‌ హైవేలో ఘట్‌కేసర్‌ నుంచి మొదలుపెడితే కనిష్ఠంగా 12 కి.మీల మొదలుకుని.. గరిష్ఠంగా 18 కి.మీ.ల వరకు పెట్టుబడి ఆకర్షక కేంద్రాలు ఉన్నాయి.

అడుగడుగునా ఆకర్షక కేంద్రాలు

 • హైదరాబాద్‌ నుంచి రామగుండం హైవే వైపు తీసుకుంటే.. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకు ఇప్పటికే రియల్‌ బూమ్‌ విస్తరించింది. శామీర్‌పేట చెరువును టూరిజంశాఖ సుమారు రూ.10 కోట్లతో ‘వీకెండ్‌ స్పాట్‌’గా అభివృద్ధి చేస్తున్నది. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక రిసార్ట్‌లు, విల్లాలు వెలిశాయి.
 • శామీర్‌పేట నుంచి విస్తరించి ఉన్న జీనోమ్‌ వ్యాలీ ప్రపంచ ప్రఖ్యాత కేంద్రంగా ఉన్నది. ఆ తర్వాత 15కి.మీ.ల దూరంలో తుర్కపల్లి మండల కేంద్రం, దాని పక్కనే 17 కి.మీ.ల దూరంలో మూడు చింతల పల్లి మండల కేంద్రం ఉన్నాయి.
 • ఆ తర్వాత హైవేకు సమీపంలోని కొండ పోచమ్మసాగర్‌ ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే రిజర్వాయర్‌ చుట్టూ పదుల కిలోమీటర్ల మేర భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి సమీపంలోనే మర్కూక్‌, వర్గల్‌, మూడుచింతలపల్లి మండల కేంద్రాలున్నాయి. వర్గల్‌ సరస్వతి ఆలయం ఇక్కడే ఉన్నది.
 • ములుగు వద్ద నిర్మించిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీ మరో ఆకర్షణ.
 • తదుపరి.. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌, దానికి ఆనుకొని ఉండే ప్రజ్ఞాపూర్‌ పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. రీజినల్‌ రింగ్‌ రోడ్డు గజ్వేల్‌ మీదుగా వెళ్తుండటంతో ధరలు మరింత పెరిగాయి.
 • గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ దాటిన తర్వాత వచ్చే గ్రామాల్లో వ్యవసాయ భూముల ధరలను కాళేశ్వరం జలాలు, కాలువలు స్థిరీకరించాయి. గజ్వేల్‌-సిద్దిపేట, గజ్వేల్‌-భువనగిరి రోడ్లను విస్తరించడంతో గ్రామాలకు కనెక్టివిటీ పెరిగింది.
 • ఆ తర్వాత కొమురవెల్లి నుంచి వరుసగా మల్లన్న ఆలయం, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌, దుద్దెడలో సమీకృత కలెక్టరేట్‌, ఐటీ టవర్‌ ఇలా సిద్దిపేట వరకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సిద్దిపేట అత్యంత వేగంగా ‘రియల్‌’ సెంటర్‌గా మారింది. పట్టణానికి ఆనుకొని ఉన్న రంగనాయక సాగర్‌ కొత్త ఆకర్షణగా మారింది. సిద్దిపేట నుంచి చుట్టూ సగటున ప్రతి 15 కిలోమీటర్లకు ఒక మండల కేంద్రం ఉన్నది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ధూం..ధాం.. రియల్‌
ధూం..ధాం.. రియల్‌
ధూం..ధాం.. రియల్‌

ట్రెండింగ్‌

Advertisement