సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 00:16:27

వెద పద్ధతిలో సాగు పరిశీలన

వెద పద్ధతిలో సాగు పరిశీలన

  • కొండపల్కలను సందర్శించిన సిద్దిపేట రైతులు

మానకొండూర్‌ రూరల్‌: కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం కొండపల్కల గ్రామంలో చేపట్టిన వెద పద్ధతిలో వరి సాగును సిద్ధిపేట రైతులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వెదజల్లుతూ వరి సాగుచేసి మంచి ఫలితాలు సాధించి ఉత్తమ మహిళా రైతుగా నిలిచిన గ్రామానికి చెందిన రూపురెడ్డి లక్ష్మి వీరికి సాగు విధానంపై అవగాహన కల్పించారు. విత్తనాలు చల్లే విధానం, ఒడ్లలో మల్చింగ్‌ చేయడం, జంబు కొట్టడం, వర్మి కంపోస్ట్‌ సేకరణ, సేంద్రియ, రసాయన ఎరువుల వాడకంతో పాటు కూలీల సంఖ్యను అధిగమించడం వంటి అంశాలపై లక్ష్మీ-తిరుపతిరెడ్డి దంపతులు స్వయంగా పని చేస్తూ  వివరించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఏవో మాట్లాడుతూ.. ఈ పద్ధతిలో కూలీల సంఖ్యను అధిగమించవచ్చని, పెట్టుబడి తక్కువ-దిగుబడి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్‌ వంగ నాగిరెడ్డి, ఏవో పరశురాంరెడ్డి, సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, నారాయణరావుపేట, చిన్న కోడూర్‌ మండలాల్లోని దాదాపు 200 మంది రైతులు, వ్యవసాయ అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సందర్శించారు.