బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 21:21:34

కన్నుల పండువగా.. సిద్దరామేశ్వరుని కల్యాణం

కన్నుల పండువగా.. సిద్దరామేశ్వరుని కల్యాణం

కామారెడ్డి  : కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండల కేంద్రంలోని సిద్దరామేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ మధుర ఘట్టాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. ఆలయంలో నూతనంగా నిర్మించిన విశాలమైన గదిలో కల్యాణ మండపాన్ని అందంగా ముస్తాబు చేశారు.

 పట్టు వస్ర్తాలు, ఆభరణాలతో స్వామి,అమ్మవార్లను అందంగా అలంకరించారు. ఉదయం 11 గంటలకు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. అనంతరం పట్టు వస్ర్తాలు సమర్పించి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం పోశారు. రాత్రి స్వామి వారి రథాన్ని ఆలయం చుట్టూ తిప్పి గ్రామ పురవీధుల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


logo
>>>>>>