ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 16:49:28

బొందుగుల చెరువులో.. సైబీరియన్‌ పక్షుల సందడి

బొందుగుల చెరువులో.. సైబీరియన్‌ పక్షుల సందడి

యాదాద్రి భువనగిరి : ఖండాంతరాలు దాటి వచ్చిన వలస పక్షులు కనువిందు చేస్తున్నాయి. రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి దాదాపు 5 వేల కిలో మీటర్ల దూరం నుంచి వచ్చిన సైబీరియన్‌ పక్షులు నీటి అలల్లో ఆహారం కోసం చేప పిల్లల వెతుకుతూ గుంపుగా సంచరిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ అపురూప దృశ్యానికి రాజాపేట మండలంలోని బొందుగుల ఊరచెరువు వేదికైంది.

ఈ పక్షులు ఆహారం కోసం వేళ మైళ్లు సూదూర ప్రయాణం చేసి ఇక్కడి చెరువుల్లో ఆవాసం ఏర్పరుచుకొని తమ సంతతని వృద్ధి చేసుకుంటున్నాయి. వలస పక్షుల రాకతో గ్రామాలు నూతన శోభను సంతరించుకున్నాయి. చెరువులోకి తొలిసారిగా వలస వచ్చిన సైబీరియన్‌ కొంగలతో పాటు వివిధ రకాల జాతుల కొంగలు, నీటి బాతులు సైతం సందడి చేస్తుండటంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.logo