గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 21:41:44

జీపు బోల్తా... ఎస్ఐకు గాయాలు

జీపు బోల్తా... ఎస్ఐకు గాయాలు

ఆదిలాబాద్ : జీపు బోల్తా ప‌డిన దుర్ఘ‌ట‌న‌లో ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లం గిమ్మ క్రాస్‌రోడ్ వ‌ద్ద గురువారం చోటుచేసుకుంది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ చీఫ్ జ‌స్టిస్ట్ కాన్వాయ్‌లో ఎస్కార్ట్‌గా ఎస్ఐ వెళ్లారు. కాగా కారు వెనుక టైరు పంక్చ‌ర్ కావ‌డంతో అదుపుత‌ప్పి వాహ‌నం బోల్తాప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఎస్ఐ వెంక‌న్న గాయ‌ప‌డ్డాడు. ఎడ‌మ కాలులో ప‌గుళ్లు ఏర్ప‌డ్డ‌ట్లు జైన‌థ్ ఇన్‌స్పెక్ట‌ర్ కె. మ‌ల్లేశ్ తెలిపారు.  చికిత్స నిమిత్తం పొరుగునే ఉన్న మ‌హారాష్ర్ట‌లోని య‌వ‌త్మ‌ల్ జిల్లాలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపాడు. 


logo