ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 15:05:07

మేడ్చల్ ​కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి

మేడ్చల్ ​కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి

మేడ్చల్​– మల్కాజిగిరి : జిల్లా కలెక్టర్‌గా శ్వేతా మహంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన వాసం వెంకటేశ్వర్లు బదిలీ కాగా ఆయన స్థానంలో హైదరాబాద్​ కలెక్టర్‌గా పని చేస్తున్న శ్వేతా మహంతి మేడ్చల్​ – మల్కాజిగిరి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్​ శ్వేతా మహంతి మాట్లాడుతూ..జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు ప్రజలు, అధికారులు, నాయకుల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రుల ఆశయాలకు అనుగుణంగా జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమస్థానంలో నిలుపుతానని ఆమె పేర్కొన్నారు.