బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 20:07:50

ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలి

ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలి

పెద్దపల్లి : ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  అధికారులను ఆదేశించారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై మంగళవారం ఎన్టీపీసీలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేశ్‌ నేత అధ్యక్షతన మంత్రి అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్టీపీసీ ప్రభావం వల్ల పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్నందున పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని, వచ్చే హరితహారం కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని చెరువులు, రహదారులు,రెవెన్యూ అటవీ భూముల్లో విరివిగా మొక్కలు నాటేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, దీనిని జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. హరితహారం, సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై సమావేశంలో ఆయన చర్చించారు.  శాసన మండలి సభ్యుడు, విప్ భానుప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్  శశాంక, ఎమ్మెల్యే కోరుకంటి చందర, దాసరి మనోహర్ రెడ్డి , గ్రంథాలయ చైర్మన్ రఘవీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.