సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 22:37:25

కొవిద్‌-19 పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఈటల

కొవిద్‌-19 పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఈటల

హైదరాబాద్‌: కరోనాతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. మంత్రి ఇవాళ ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిని సందర్శించారు. కరోనా వైరస్‌(కొవిద్‌-19) దృష్ట్యా.. ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్‌ వార్డులను మంత్రి పరిశీలించారు. వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్‌ వార్డులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌.. ఇటీవల గాంధీ ఆస్పత్రిని సందర్శించిన విషయం తెలిసిందే. వ్యాధి లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన బాధితులతో మంత్రి మాట్లాడి, వారికి భరోసా ఇచ్చారు. చిన్న చిన్న జాగ్రాత్తలు పాటిస్తే.. కరోనా దరికి చేరదని మంత్రి వెల్లడించారు. కాగా, మంత్రి.. ఇవాళ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని, ఆస్పత్రి సమూదాయంలో ప్రత్యేకంగా ఉన్న భవంతిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులను వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు. రెండు అంతస్తుల్లోని భవనంలో నాలుగు వార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ వార్డుల్లో వెంటిలేషన్‌తో పాటు 56 బెడ్లను సిద్దం చేశారు. కాగా, వాటితో పాటు మరో 4 సపరేటు గదులు కూడా సిద్దం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

కేరళలో మరో 5 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర వైద్య యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కూడా ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేష్‌ రెడ్డి, రాష్ట్ర వైద్య మౌళిక సదుపాయాల కార్పోరేషన్‌ ఎండీ డా. చంద్రశేఖర్‌ రెడ్డి, సీఈ లక్ష్మా రెడ్డి, చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఉన్నారు. 


logo