బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:10:20

పారదర్శకంగా చికిత్స చేయాలి

పారదర్శకంగా చికిత్స చేయాలి

  • ప్రైవేట్‌ హాస్పిటళ్ల యజమానులతో గవర్నర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ సంక్షోభ సమయంలో ప్రైవేట్‌ హాస్పిటళ్లు పారదర్శకంగా చికిత్స అందించాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సూచించారు. రోగుల పట్ల బాధ్యతతో, మానవతా దృక్పథం తో వ్యవహరించాలన్నారు. మంగళవారం రాజ్‌భవన్‌ నుంచి ప్రైవేట్‌ వైద్యశాలల యజమానులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లా డారు. ప్రజలకు అందుబాటు ధరలోనే వైద్యం అందించాలని గవర్నర్‌ సూచించారు. వైద్యానికి నిరాకరించవద్దని అన్నారు. ల్యాబొలేటరీల ఫలితాలు వెంటవెంటనే అందేలా చూడాలని చెప్పారు. చికిత్స, బిల్లుల విషయంలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. హెల్త్‌కార్డులు, బీమాకార్డులు ఉన్నవారి వైద్యం కోసం బీమా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వీడియో కన్సల్టేషన్‌, టెలీమెడిసిన్‌, కౌన్సెలింగ్‌ సేవలకు వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమీక్షలో కేర్‌, కిమ్స్‌, సన్‌షైన్‌, కాంటినెంటల్‌, మల్లారెడ్డి, అపోలో, యశోద, గ్లోబల్‌ తదితర హాస్పిటళ్ల వైద్యులు పాల్గొన్నారు. logo