ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 16:14:39

వైద్యసిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్

వైద్యసిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖలో ఖాళీగా ఉన్న  వైద్యసిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని వెల్లడించారు. శ్రీకాకుళం రిమ్స్ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖలో 9700 మంది సిబ్బంది నియామయానికి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు కార్పొరేట్ తరహాలో వైద్య సహాయం అందజేస్తామని ప్రకటించారు. రిమ్స్ దవాఖానలో ఎంఆర్ సీటీఐ స్కాన్ పనిచేయకపోవడంపై అధికారులపై ఆయన మండిపడ్డారు. 


logo