శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 12:19:39

కామారెడ్డిలో షార్ట్‌ సర్య్కూట్‌తో కంటైనర్‌ దగ్ధం

కామారెడ్డిలో షార్ట్‌ సర్య్కూట్‌తో కంటైనర్‌ దగ్ధం

కామారెడ్డి: జిల్లాలోని బిక్కనూరులో జాతీయ రహదారిపై కంటైనర్‌ అగ్నికి ఆహుతయ్యింది. నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కంటైనర్‌లో మండలంలోని అంతంపల్లి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ లారీ నుంచి దూకేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్య్కూటే‌ ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. దీంతో జాతీయరహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.