శనివారం 11 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 13:29:04

పాతబస్తీలో 15రోజులు దుకాణాలు బంద్‌

పాతబస్తీలో 15రోజులు దుకాణాలు బంద్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేవలం హైదరాబాద్‌లోనే 774 పాజిటివ్‌ కేసులు రావడంతో ఆందోళన నెలకొంది. దీంతో పాతబస్తీలోని కొందరు వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 15 రోజుల పాటు దుకాణాలను మూసివేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో లాడ్‌ బజార్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ స్వచ్ఛందంగా 15రోజులు బంద పాటిస్తున్నారు.

దీంతో చార్మినార్‌ ప్రాంతంలో జనసముదాయం భారీగా తగ్గింది. అలాగే ఆదివారం నుంచి జూలై 5 వరకు బేగంబజార్‌ మూసివేస్తున్నట్లు అక్కడి వ్యాపారులు ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో 7,436 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. చికిత్స పొంది కోలుకున్న వారు 4,766 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 75,308మందికి కరోనా టెస్టులు చేశారు. logo