త్రివిక్రమ్ ఎప్పుడూ స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తాడు.. చిన్న హీరోలను అస్సలు పట్టించుకోడు. అందులోనూ కేవలం బన్నీ, పవన్, మహేష్ బాబు చుట్టూనే తిరుగుతుంటాడు అనే విమర్శలు బాగా వస్తున్న తరుణంలో ఉన్నఫలంగా తన రూట్ మార్చేసి నితిన్ లాంటి కుర్ర హీరోతో మాటల మాంత్రికుడు చేసిన సినిమా అ..ఆ, సమంత, అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.
తన మాతృసంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం 2016 జూన్ 2న విడుదలైంది. అంటే నేటితో ‘అ..ఆ’ విడుదలై 5 ఏళ్ళు పూర్తి అయిపోయింది. నితిన్ కెరీర్లో ఈ రోజుకు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. మరి ఈ చిత్రం అప్పుడు సాధించిన కలెక్షన్స్ చూద్దాం..
నైజాం- 13.19 కోట్లు
సీడెడ్- 4.18 కోట్లు
ఉత్తరాంధ్ర- 4.22 కోట్లు
ఈస్ట్- 2.39 కోట్లు
వెస్ట్- 1.98 కోట్లు
గుంటూరు- 2.50 కోట్లు
కృష్ణా- 2.20 కోట్లు
నెల్లూరు- 0.98 కోట్లు
ఏపీ + తెలంగాణ- 31.64 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 5.15 కోట్లు
ఓవర్సీస్- 10.65 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్- 47.44 కోట్లు
ఈ సినిమాను అప్పట్లో 27.71 కోట్లకు అమ్మారు. నితిన్ కంటే కూడా త్రివిక్రమ్ ఉన్నాడనే ధైర్యంతో కొనేసారు బయ్యర్లు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఫుల్ రన్ అయ్యేసరికి ఏకంగా 47.44 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లోనే 2 మిలియన్ మార్క్ అందుకుంది అ..ఆ. బయ్యర్లకు దాదాపు 20 కోట్ల లాభాలు తీసుకొచ్చింది అ..ఆ సినిమా.
ఇవి కూడా చదవండి..
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి