శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 16, 2021 , 07:51:02

నేటి నుంచి గొర్రెల పంపిణీ

నేటి నుంచి గొర్రెల పంపిణీ

హైదరాబాద్ : కరోనా కారణంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ శనివారం నుంచి పునఃప్రారంభం కానుంది. ఉదయం 11.30 గంటలకు మండలి చైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండలోని బత్తాయి మార్కెట్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డీడీలు చెల్లించిన 28,335 మందికి 5.95 లక్షల గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయినట్టు పశుసంవర్ధకశాఖ అధికారులు పేర్కొన్నారు. 

VIDEOS

logo