ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 12:00:25

సిద్దిపేట నమూనాగా అన్ని జిల్లాల్లో గొర్రెల షెడ్లు : మంత్రి తలసాని

సిద్దిపేట నమూనాగా అన్ని జిల్లాల్లో గొర్రెల షెడ్లు : మంత్రి తలసాని

సిద్దిపేట : జిల్లాలోని గౌరారం మండల కేంద్రంలో జాతీయ కృత్రిమ గర్భధారణ రెండో దశ కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి హరీశ్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..సిద్దిపేట నమూనాగా అన్ని జిల్లాల్లో గొర్రెల షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. అలాగే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. 

డీడీలు కట్టిన వారందరికీ గొర్రెల పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. పాడి పై ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. నరేగా కింద అర్హులైన వారందరికీ పశువులు, గొర్రెల షెడ్లను మంజూరు చేస్తామని మంత్రి తలసాని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.logo