శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:33

గులాబీరంగులో టాయిలెట్‌ బస్సులు

గులాబీరంగులో టాయిలెట్‌ బస్సులు

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్‌ బస్సులు గులాబీరంగులో ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు బస్సుల రంగులు మార్చినట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు. బుధవారం ఖమ్మంలోని ఎస్సార్‌-బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో వీటిని అందుబాటులో ఉంచారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బయో టాయిలెట్‌ బస్సులు గులాబీ రంగులోనే ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌'ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుచేస్తామని చెప్పారు. 

తాజావార్తలు


logo