బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 01:03:50

రాహుల్‌ 1962ని మరిచావా?

రాహుల్‌ 1962ని మరిచావా?

  • భారత్‌, చైనా మధ్య యుద్ధానంతరం 45వేల చదరపు 
  • కిలోమీటర్ల భూభాగాన్ని డ్రాగన్‌ కబ్జా చేయలేదా?: పవార్‌ 

సతారా: 1962లో జరిగిన యుద్ధం తర్వాత దాదాపు 45,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిన విషయాన్ని మరిచిపోయావా అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు పవార్‌ ప్రశ్నించారు. సరిహద్దు ఘర్షణపై  కేంద్రం మీద రాహుల్‌ వరుస విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం పవార్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘1962లో భారత్‌, చైనా మధ్య యుద్ధం జరిగిన తర్వాత 45,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. దీన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ భూభాగం ఇప్పటికీ చైనా ఆధీనంలోనే ఉన్నది. గల్వాన్‌ ఘటన చాలా సున్నితమైనది. మన జవాన్లను రెచ్చగొట్టేలా చైనా వ్యవహరిస్తున్నది. ఈ విషయంలో రాజకీయాలు చేయడం తగదు’ అని పేర్కొన్నారు.


logo