బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 03:00:39

సురజిత్‌ ధారకు ‘శాంతిస్వరూప్‌' అవార్డు

సురజిత్‌ ధారకు ‘శాంతిస్వరూప్‌' అవార్డు

కొండాపూర్‌: గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ విభాగం ఫ్యాకల్టీ డాక్టర్‌ సురజిత్‌ ధార ప్రతిష్ఠాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ (ఎస్‌ఎస్‌బీ) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- 2020 అవార్డుకు ఎంపికైనట్టు వర్సిటీ పీఆర్వో ఆశిష్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ఇండియా ఫౌండర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ స్మారకార్థం ఈ అవార్డు ఇస్తున్నారని చెప్పారు. అవార్డుగ్రహీతకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకం అందిస్తారన్నారు. బయోలాజికల్‌ సైన్సె స్‌ తదితర విభాగాల్లో ఉత్తమ సేవలందించేవారికి సీఎస్‌ఐఆర్‌ కింద ప్రతినెలా రూ.15వేల గ్రాంట్‌ అందజేస్తున్నారని తెలిపారు.


logo