శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 18:24:17

ఆడబిడ్డలకు అండ‌గా ప్రభుత్వం : మంత్రి అల్లోల‌

ఆడబిడ్డలకు అండ‌గా ప్రభుత్వం :  మంత్రి అల్లోల‌

మంచిర్యాల‌ : రాష్ర్టంలోని ఆడ‌బిడ్డ‌ల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని రాష్ర్ట అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. చెన్నూర్ పట్టణంలోని స్థానిక సంతోషిమాత ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. చెన్నూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 661 మంది ల‌బ్ధిదారుల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్  చెక్కులను అంద‌జేశారు.  ఈ సందర్భంగా మంత్రి ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్  ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఈ పథకం వరంగా మారిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేప‌ట్ట‌లేదని తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ నల్లాల భాగ్యలక్ష్మి , త‌దిత‌రులు పాల్గొన్నారు.


logo