మైనర్పై లైంగిక దాడి.. గర్భం దాల్చడంతో వెలుగులోకి..

మహబూబాబాద్ : మైనర్పై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. కురవి మండలం గ్రామీణ తండాలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. గ్రామీణ తండాకు చెందిన ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. కరోనా లాక్డౌన్ కావడంతో మార్చి నుంచి ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికపై ఇంటి పక్కనే ఉన్న వరసకు బాబాయి అయ్యే హేమ నాయక్ కన్నేశాడు. ఆమెను బెదిరించి లైంగికదాడి చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయపడి ఎవరికీ చెప్పలేదు.
రెండురోజుల క్రితం బాలిక అనారోగ్యానికి గురికావడంతో బుధవారం తల్లి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. బాలిక గర్భవతి అని వైద్యులు చెప్పడంతో దిగ్భ్రాంతికి లోనైంది. బాధితురాలిని ప్రభుత్వ దవాఖానకు పంపగా విషయం తెలుసుకున్న బాల రక్షాబంధన్ కోఆర్డినేటర్ జ్యోతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పుట్ట కమలాకర్ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలికను వరంగల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి, బాలల సంక్షేమ సమితి చైర్మన్ పరశురాములు ఆదేశాల మేరకు రక్షణ కల్పించారు. తల్లిదండ్రుల సమక్షంలో బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించగా జరిగిన విషయం చెప్పింది. బాలల సంరక్షణ అధికారులు వీరన్న, నరేశ్, ఐసీడీఎస్ సూపర్ వహీదా సాయంతో తల్లిదండ్రులు కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఏపీలో కొత్తగా 158 మందికి కోరోనా
- తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది : సీఎం
- మహిళలు, పిల్లలపై హింసను ఎదుర్కొనేందుకు 'సంఘమిత్ర'
- బిజినెస్ ఫ్రెండ్లీకి దెబ్బ: ‘మహా’ సర్కార్కు జీఎం వార్నింగ్!
- పాలమూరు-రంగారెడ్డి’ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
- 2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..
- దిగివచ్చిన బంగారం ధరలు
- రేపు సర్వార్థ సంక్షేమ సమితి 28వ వార్షికోత్సవాలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- 2020 బెస్ట్ సెల్లింగ్ మారుతి ‘స్విఫ్ట్’