శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 21:59:28

నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడి

నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడి

భద్రాద్రి కొత్తగూడెం :  ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలు మారడం లేదు. చిన్నారులు, మహిళలపై అకృత్యాలకు ఒడిగడుతూ పశువాంఛ తీర్చుకుంటున్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో అభంశుభం తెలియని నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి జరిగింది. పారిశ్రామిక ప్రాంతమైన సారపాక భాస్కర్‌నగర్‌ ఎస్టీ కాలనీలో మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

ఎస్‌ఐ బమ్మెర బాలకృష్ణ తెలిపిన వివరాలివి.. భాస్కర్‌నగర్ కాలనీలోని ఎస్టీ కాలనీకి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి చాకెట్లు కొనుక్కునేందుకు ఇంటి సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. దుకాణ సమీపంలో నివాసం ఉండే ఆటోడ్రైవర్‌ పింగళి గణేశ్‌ అలియాస్ చింటూ చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన తరువాత చిన్నారి విషయాన్ని తల్లికి చెప్పడంతో తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి యువకుడి ఇంటికి వెళ్లి అతడిని చితకబాది పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.