ఆదివారం 31 మే 2020
Telangana - May 18, 2020 , 00:25:54

ఏడు స్టేషన్లు.. 54 శ్రామిక్‌ రైళ్లు

ఏడు స్టేషన్లు.. 54 శ్రామిక్‌ రైళ్లు

  • స్వగ్రామాలకు 70 వేల మంది వలస కూలీల తరలింపు
  • ఫలిస్తున్న తెలంగాణ ప్రభుత్వ చొరవ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వలస కూలీల తరలింపులో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ సత్ఫలితాలిస్తున్నది. ఎస్సీఆర్‌ పరిధిలో మొత్తం 93 శ్రామిక్‌ రైళ్లు కూలీలను గమ్యస్థానాలకు చేరవేయగా.. అందులో 54 రైళ్లు తెలంగాణ నుంచే నడిచాయి. జోన్‌ పరిధిలో 1.18 లక్షల మంది వివిధ రాష్ట్రాలకు వెళ్లారు. అందులో 70 వేల మంది తెలంగాణ నుంచి వెళ్లిన కూలీలే కావడం గమనార్హం. స్వరాష్ట్రాలకు చేరేందుకు ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను తెలంగాణ ప్రభుత్వం  సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపిస్తున్నది. మే 17 వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో మొత్తం 93 శ్రామిక్‌ రైళ్లు కూలీలతో వివిధ రాష్ట్రాలకు నడిచాయి. బీహార్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ ఇందులో ఉన్నాయి. వలస కార్మికులను తరలించేందుకు మరిన్ని శ్రామిక్‌ రైళ్లు నడుపుతామని  దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా తెలిపారు.


logo