మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 22:04:07

ఏడు పంచాయతీలకు స్వశక్తికరణ్‌ పురస్కారాలు

ఏడు పంచాయతీలకు స్వశక్తికరణ్‌ పురస్కారాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఏడు గ్రామ పంచాయతీలు కేంద్ర దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్‌ పురస్కారానికి ఎంపికయ్యాయి. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ జాయింట్‌ సెక్రెటరీ జాబితాను విడుదల చేశారు. ఇందులో జనరల్‌ కేటగిరిలో పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌, కిష్టంపేట, నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట, సిద్దిపేట జిల్లాలోని గుర్రాలగొంది, పెద్దలింగారెడ్డిపల్లి, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని గంగారం గ్రామాలు అవార్డులకు ఎంపికయ్యాయి. సహజ వనరుల నిర్వహణ, శానిటేషన్‌, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల్లో మెరుగైన ప్రదర్శన చూపిన పంచాయతీలను కేంద్రం స్వశక్తి కిరణ్‌ పురస్కారాలను అందిస్తున్నది.


logo