గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 02:54:50

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో మరో ఏడు అంబులెన్సులు

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో మరో ఏడు అంబులెన్సులు

  • జెండాఊపి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా పార్టీ ప్రజాప్రతినిధులు అందించిన పలు అంబులెన్సులు సేవకు కదులుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో మరో ఏడు అంబులెన్సులను జెండాఊపి ప్రారంభించారు. ఇందులో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మూడు, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ రెండు, మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్‌ దివాకర్‌రావు, మల్కాజిగిరి నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఒక్కో అంబులెన్సు అందించారు. నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లోని కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాఖల నిర్వహణలో ఈ అంబులెన్సులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి మండలాల్లో ఒకటి, కోటపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్‌ మండలాల్లో మరోటి సేవ లందిస్తుందని బాల్క సుమన్‌ చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు అల్లోల గౌతంరెడ్డి, నడిపెల్లి విజిత్‌రావు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, కేశవరెడ్డి, అనితా ప్రభాకర్‌, పాండుయాదవ్‌, నళికిన కిరణ్‌, భాగ్యశ్రీ శ్యామ్‌, లోకనాథ్‌ పాల్గొన్నారు.logo