మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 15:13:05

కత్తులతో పుట్టినరోజు చేసుకున్న ఏడుగురికిపై కేసు

కత్తులతో పుట్టినరోజు చేసుకున్న ఏడుగురికిపై కేసు

జగిత్యాల : కత్తులతో కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న ఏడుగురి యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గుండా ప్రశాంత్‌ గౌడ్‌(26) ఈ నెల 2వ తేదీన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాడు. ఈ వేడుకలో అతని స్నేహితులు పెద్ద కత్తితో కేక్‌ కట్‌ చేయించారు. కత్తులతో ఫోజులు ఇస్తూ ఫోటోలు తీసుకున్నారు. ప్రశాంత్‌ గౌడ్‌ కత్తి పట్టుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఏడుగురు యువకులపై కేసు నమోదు చేశారు.


logo