మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 21, 2020 , 15:44:57

జర్నలిస్టుల సేవలు మరువలేనివి:మంత్రి నిరంజన్‌రెడ్డి

జర్నలిస్టుల సేవలు మరువలేనివి:మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి: కరోనా కట్టడిలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...నిస్వార్థంతో మీడియా ప్రజలను జాగృతం చేస్తుంది. నిరంతరం వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టులు ప్రముఖపాత్ర పోషిస్తున్నారు. వార్తల సేకరణలో పడి ఆరోగ్యాన్ని నిర్ణక్ష్యం చయవద్దు. కరోనా వైరస్‌ ప్రాణాంతకం... అది దరిచేరకుండా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌లు తప్పక ధరించాలని కోరారు. logo