బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 07:53:12

ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లకు సర్వర్‌ సమస్యలు

ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లకు సర్వర్‌ సమస్యలు

హైదరాబాద్ : జూన్‌1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రైల్వే శాఖ 200 రైళ్లను నడపనుండగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో తెలుగు రాష్ర్టాల మధ్య 8 రైళ్లు నడవనున్నాయి. దీని కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌చేసుకొనే వ్యక్తులకు గురువారం సర్వర్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి.

సికింద్రాబాద్‌ నుంచి నాలుగు రైళ్లు హౌరా, ధన్‌పూర్‌, గుంటూరు, నిజాముద్దీన్‌ ప్రాంతానికి నడుస్తుండగా హైదరాబాద్‌ నుంచి మూడు రైళ్లు న్యూఢిల్లీ, ముంబాయి, వైజాగ్‌ మధ్య రాకపోకలు సాగిస్తాయి. అదేవిధంగా తిరుపతి నుంచి నిజామాబాద్‌కు ఒక రైలు, నాందేడ్‌ నుంచి అమృత్‌సర్‌కు మరో రైలు రాకపోకలు సాగిస్తాయి.అయితే కొన్ని మిలటరీ, పోలీస్‌ వారెంట్లు, వోచర్లు, రైల్వే, స్వాతంత్య్ర సమరయోధులు ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం సికింద్రాబాద్‌ స్టేషన్లో ప్రత్యేక కౌంటర్‌ను తెరిచి టికెట్లు జారీ చేస్తారు. 

అంతేకాకుండా కేంద్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, సుప్రీంకోర్టు ,హైకోర్టు జడ్జీలు, దివ్యాంగులు, రోగులు,విద్యార్థుల కోసం  దీని ద్వారా టికెట్లు జారీ అవుతాయి. నాన్‌ ఏసీ , ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. గరిష్ఠంగా 30 రోజుల ముందు రిజర్వేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐఆర్‌సీటీసీ ప్రతినిధి సంజీవయ్యను సర్వర్‌ ఇబ్బందులపై వివరణ కోరగా అటువంటిదేమీలేదని తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo