శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 17:29:43

వృత్తి మీద ప్రేమతో సేవ చేయండి

వృత్తి మీద ప్రేమతో సేవ చేయండి

 మహబూబ్ నగర్ : సేవ చేసే  గొప్ప అవకాశం వైద్య వృత్తి ద్వారా వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో నూతనంగా స్టాఫ్ నర్స్ లు గా ఎంపికైన 160 మందికి నియామక ఉత్తర్వులను అందజేశారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అన్నింటికన్నా విలువైంది ప్రాణమని, ప్రాణాలను కాపాడే వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లు, నర్సులు దేవుళ్లతో సమానం అన్నారు. ప్రపంచంలో వైద్య వృత్తి అత్యున్నతమైనది అన్నారు. వృత్తి మీద ప్రేమతో కొత్తగా ఎన్నికైన స్టాఫ్ నర్సులు పనిచేయాలని, ఉదార స్వభావం కలిగి ఉండాలని, పూర్తిస్థాయిలో రోగులకు సేవలు అందించాలని  ఆయన పిలుపునిచ్చారు.

జిల్లాలో 2014 సంవత్సరంలో కేవలం 18 మంది డాక్టర్లు, 72 మంది నర్సులు మాత్రమే ఉండగా ప్రస్తుతం 210 మంది డాక్టర్లు, 470 మంది నర్సులు పనిచేస్తున్నారని, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వైద్యపరంగా హైదరాబాద్ కు వెళ్లకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.  రూ.400 కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాలను నిర్మించామనన్నారు. జిల్లాకు కరోనా  టెస్టింగ్ ల్యాబొరేటరీ త్వరలోనే వస్తుందని ఆయన పేర్కొన్నారు.


logo