మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 17:21:45

వి-హ‌బ్ తో సెర్ప్ ఎంఓయూ..నిరుపేద మ‌హిళ‌ల‌కు పారిశ్రామిక శిక్షణ

వి-హ‌బ్ తో సెర్ప్ ఎంఓయూ..నిరుపేద మ‌హిళ‌ల‌కు పారిశ్రామిక శిక్షణ

హైద‌రాబాద్ : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణనిచ్చే ఉమెన్-హ‌బ్ సంస్థతో నిరుపేద ఔత్సాహిక మహిళ‌ల‌కు పరిశ్రమల మీద శిక్షణ ఇచ్చేందుకు వీలుగా సెర్ప్ ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చింది. హైద‌రాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్ ‌‌టీఎస్ ఐ పార్డ్ లో గురువారం జ‌రిగిన ఫుడ్ ప్రాసెసింగ్ వ‌ర్క్ షాపు లో పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు స‌మ‌క్షంలో ఈ ఎంఓయూ జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, వి-హ‌బ్ సీఈవో దీప్తి రెడ్డి ఎంఓయూ ప‌త్రాల‌ను పరస్పరం అందుకున్నారు. కాగా, ఈ ఒప్పందం ప్రకారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో న‌డుస్తున్న వి-హ‌బ్, సెర్ప్ ఆధ్వర్యంలోని నిరుపేద మ‌హిళ‌ల‌కు ఫుడ్ ప్రాసెసింగ్ ప‌లు అంశాల‌పై శిక్షణ ఇస్తుంది. మ‌హిళ‌ల సాధికార‌త దిశ‌గా ప‌ని చేయాల‌ని రెండు సంస్థలకు మంత్రి ఎర్రబెల్లి ఈ సంద‌ర్భంగా సూచించారు.


logo