సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 23:05:11

గేదెను బైక్‌ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

గేదెను బైక్‌  ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

ములుగు : బైక్‌ అదుపుతప్పి ఎదురుగా వస్తున్నగేదెను ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో శనివారం రాత్రి ఈ ఘటన జరింది. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సోహెల్‌(18) అనే యువకుడు వ్యక్తిగత పనులతో బైక్‌పై బయల్దేరాడు. మార్గమధ్యలో గేదెను ఎదురుగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉండటంతో చికిత్స నిమిత్తం వరంగల్‌ దవాఖానకు తరలించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.