బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 12:34:52

కరోనా చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రి!

కరోనా చికిత్సకు ప్రత్యేక ఆస్పత్రి!

హైదరాబాద్‌ : కరోనా చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటామన్నారు. ప్రయివేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నామని మంత్రి చెప్పారు. కరోనా అనుమానితులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపాలని కోరామని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రజలకు విశ్వాసం కలిగించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 9 ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తాయి. ప్రతి శాఖకు ఒక నోడల్‌ అధికారి ఉంటారని మంత్రి తెలిపారు. 

కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్య శాఖ అధికారులతో కలిసి మంత్రులు సమీక్షించారు. ప్రజల్లో అవగాహన పెంచడం సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.


logo
>>>>>>