బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:12:45

1.12 లక్షల వేల అద్దె మాఫీ

1.12 లక్షల వేల అద్దె మాఫీ

  • కేటీఆర్‌ ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో భాగంగా ఓ ఇంటి యజమాని సంచలన నిర్ణయం

ఉప్పల్‌ : గిఫ్ట్‌ ఏ స్మైల్‌.. ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని చేపట్టిన సేవా కార్యక్రమం. కరోనా కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తోడుగా నిలవాలని పిలుపునిస్తూ దీన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌కు విశేష ఆదరణ లభిస్తున్నది. ఉప్పల్‌లోని చిలుకానగర్‌కు చెందిన కరుణాకర్‌రెడ్డి.. తన ఇంట్లో కిరాయికి ఇంటున్న సంతోష్‌రెడ్డికి ఏకంగా రూ.1.12 లక్షల అద్దె మాఫీచేశారు. కరుణాకర్‌ రెడ్డి ఇంట్లో సంతోష్‌రెడ్డి జిమ్‌ను నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌, కరోనా నేపథ్యంలో అది మూతపడింది. అద్దె కట్టలేని పరిస్థితి ఎదురైంది. దీంతో అతడి ఇబ్బందిని గుర్తించిన ఇంటి యజమాని అద్దె మాఫీ చేశాడు. ఆదర్శంగా నిలిచిన కరుణాకర్‌రెడ్డిని పలువురు సత్కరించారు.


logo