బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 03:23:20

సీనియర్‌ వీడియో జర్నలిస్టు ప్రకాశ్‌ మృతి

సీనియర్‌ వీడియో జర్నలిస్టు ప్రకాశ్‌ మృతి

  • మంత్రులు, పలువురు ప్రముఖుల సంతాపం
  • ఎంపీ సంతోష్‌కుమార్‌, టీ న్యూస్‌ సిబ్బంది నివాళి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీనియర్‌వీడియో జర్నలిస్టు, తెలంగాణ వీడియో జర్నలిస్టు అసోసియేషన్‌ అధ్యక్షుడు పోలంకి ప్రకాశ్‌ (43) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తన నివా సం నుంచి కిడ్నీ సంబంధ సమస్యతో చికిత్సకోసం దవాఖానకు చేరుకున్నారు. అంతలోనే గుండెపోటుతో కుప్పకూలారు. టీన్యూస్‌ ఆవిర్భావం నుంచి ఆయన కెమెరా విభాగం ఇంచార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రకాశ్‌ మృతిపై మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 

ప్రకాశ్‌ మృతి తీరని లోటని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పేర్కొ న్నారు. టీ న్యూస్‌ ఆరం భం నుంచి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. టీ న్యూస్‌ సిబ్బంది కన్నీటి నివాళి అర్పించా రు. ప్రకాశ్‌ మృతి జర్నలిస్టులకు తీరని లోటని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. ప్రకాశ్‌ మరణం బాధాకరమని అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నా రు. ప్రకాశ్‌ మృతికి సంతాపం తెలిపిన వారి లో టీయూడబ్ల్యుజే (హెచ్‌ 143) ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్‌, తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్‌, ప్రధాన కార్యదర్శి రమణకుమార్‌, టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌, ప్రధానకార్యదర్శి విరాహత్‌ అలీ తదితరులు ఉన్నారు.


logo