శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 15:30:20

వాహ‌ద‌త్ ఈ ఇస్లామీ అధ్య‌క్షుడు న‌సీరుద్దీన్ క‌న్నుమూత‌

వాహ‌ద‌త్ ఈ ఇస్లామీ అధ్య‌క్షుడు న‌సీరుద్దీన్ క‌న్నుమూత‌

హైద‌రాబాద్ : ముస్లిం మ‌తాధికారి, వాహ‌ద‌త్ ఈ ఇస్లామీ అధ్య‌క్షుడు మౌలానా న‌సీరుద్దీన్(70) అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ శ‌నివారం ఉద‌యం త‌న ఇంట్లో క‌న్నుమూశాడు. గ‌త వారం రోజుల నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న న‌సీరుద్దీన్.. సైదాబాద్ లోని త‌న నివాసంలోనే చికిత్స పొందుతున్నాడు. ఆక‌స్మాత్తుగా శ‌నివారం ఉద‌యం తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామన్నారు. న‌సీరుద్దీన్ మృతి ప‌ట్ల ముస్లిం మ‌త పెద్ద‌లు నివాళుల‌ర్పించారు.  

సీఏఏ, ఎన్నార్సీకి వ్య‌తిరేకంగా జాయింట్ యాక్ష‌న్ క‌మిటీని ఏర్పాటు చేశారు న‌సీరుద్దీన్. గుజ‌రాత్ మాజీ హోంమంత్రి హారెన్ పాండ్య హ‌త్య కేసులో న‌సీరుద్దీన్ ఏడేళ్ల జైలు జీవితం గ‌డిపి విడుద‌ల‌య్యాడు. 


logo