శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 24, 2020 , 01:13:43

సీనియర్‌ జర్నలిస్టు ఆత్మహత్య

సీనియర్‌ జర్నలిస్టు ఆత్మహత్య
  • హుస్సేన్‌సాగర్‌లో దూకిన సాక్షి సబ్‌ఎడిటర్‌ ప్రభాకర్‌

ఖైరతాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శని వారం అర్ధరాత్రి త ర్వాత పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు కాగా.. ఆదివారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లో మృతదేహమై కన్పించారు. వరంగల్‌ జిల్లాకు చెందిన వొడ్డాలపు ప్రభాకర్‌ (43) సాక్షి దినపత్రికలో సీనియర్‌ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో ఆనంద్‌నగర్‌కాలనీలో కుమారుడు శిల్పితోకలిసి ఉంటున్న ఆయ న.. శనివారం సాయంత్రం ఇంటినుంచి బయటకుకెళ్లారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుమారుడు శిల్పి.. తండ్రికి ఫోన్‌చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చిం ది. దీంతో బంధువులు, స్నేహితులు, తండ్రి పనిచేసే కా ర్యాలయానికి వెళ్లి ఆరాతీస్తే.. అక్కడికి రా లేదని చెప్పడంతో ఉదయం 2గంటలకు పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యా దు చేశారు. రాంగోపాల్‌పేట పోలీసులు ఆదివారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్‌లో మృతదేహాన్ని గుర్తించారు. అతడి వద్ద లభించిన ఐడీ కార్డు ఆధారంగా వివరాలు తెలుసుకొని.. పంజాగుట్ట పోలీసులకు సమాచారమందించా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం గాంధీ దవాఖానకు తరలించారు. కాకతీయవర్సిటీ నుంచి పీజీలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ప్రభాకర్‌.. వివిధపత్రికల్లో జర్నలిస్టుగా, పలు సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ఆయన మృతికి హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌ విజయ్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. 


logo