గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:50:48

మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ మృతి

మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ మృతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎంనాయకుడు మస్కు నర్సింహ (52) కన్నుమూశారు. ఐదురోజుల క్రితం అనారోగ్యంతో ఆయన నిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 2004లో సీపీఎం నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ప్రస్తుతం జిల్లా వ్యవసాయకార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. నర్సింహ మృతి పట్ల సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు చెరుకుపల్లి సీతారాములు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.


logo