ఆదివారం 31 మే 2020
Telangana - May 10, 2020 , 14:02:11

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష : మంత్రి జగదీశ్‌ రెడ్డి

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష : మంత్రి  జగదీశ్‌ రెడ్డి

యాదాద్రి భువనగిరి : కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు . చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మండల వ్యాప్తంగా ఉన్న పేదలకు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు .అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటుతప్పదని హెచ్చరించారు. బయటికి వచ్చినప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని,  శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని, మాస్క్ లను ధరించాలని సూచించారు .లాక్ డౌన్ ఎత్తేసినంత మాత్రాన కరోనా అంతమైంది అన్న భావన సరికాదన్నారు. 

 క్రమశిక్షణతో కరోనాకు అడ్డుకట్ట వేయాలని మంత్రి సూచించారు .పేదలకు సరుకుల పంపిణీ కి ముందుకొచ్చిన దాతలను అభినందించారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు


logo