మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 10:41:49

జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణలో ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి

జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణలో ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్‌ : ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికవారు స్వీయ నియంత్రణలో ఉంటూ కరోనా ఎదుర్కోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం, కంటాయపాలెం, మడిపల్లె గ్రామాలను మంత్రి నేడు సందర్శించారు. ముంబయి నుంచి ఇటీవల వచ్చిన వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా తేలండంతో మంత్రి ఆయా గ్రామాలను సందర్శించి ప్రజలకు భరోసా కల్పించారు. భయపడాల్సిన అవసరం లేదని, భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి జరగకుండా పకడ్భంది చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో వాలంటీర్లను నియమించి వారి ద్వారా ప్రజావసరాలు తీర్చాలన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు.logo