ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 15:20:25

హరిత టూరిజం హోటల్స్ నిర్మాణానికి స్థలాల ఎంపిక

హరిత టూరిజం హోటల్స్ నిర్మాణానికి  స్థలాల ఎంపిక

పెద్దపల్లి : జిల్లాలో పర్యాటక అంశం దృష్టిలో ఉంచుకొని రెండు హరిత టూరిజం హోటళ్లను నిర్మించడానికి  వీలుగా ఉన్న స్థలాలను ఎంపిక చేసి జిల్లా టూరిజం అధికారికి అప్పగించామని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఎస్టేట్ అధికారి సి.సునంద  తెలిపారు. బుధవారం పెద్దపల్లి మండలంలోని పెద్ద కాల్వల గ్రామం, రామగుండం మండలంలోని మల్కాపూర్ గ్రామంలో కేటాయించిన భూములను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. 

ఈ మేరకు జిల్లా టూరిజం అధికారికి భూములను అప్పగించారు. గోదావరిఖనిలో గోదావరి నది సమీపంలో ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద హరిత టూరిజం హోటల్ నిర్మించడానికి వీలుగా మల్కాపూర్ గ్రామంలో సర్వే నెం.84 లోని 12 గుంటల భూమిని, పెద్దపల్లి సమీపంలో హరిత టూరిజం హోటల్ నిర్మించడానికి వీలుగా పెద్దకాల్వల గ్రామంలో సర్వే నెం.199,   పెద్దబోంకూరులో సర్వే నెం. 56లో 34 గుంటల భూమిని కేటాయించారు.


logo