గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Aug 03, 2020 , 14:33:52

అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టివేత

యాదాద్రి భువనగిరి : అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన జిల్లాలోని మోటకొండూరు మండలం దిలావర్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. దిలావర్ పూర్ గ్రామంలో ఓ వ్యవసాయ క్షేత్రంలో పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారన్న విశ్వసనీయ సమాచారంతో.. ఆదివారం రాత్రి పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నామని తెలిపారు. ఈ మేరకు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక గ్రామ పంచాయతీలో నిల్వ ఉంచామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.