e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home తెలంగాణ మత్తుతో యువత చిత్తు

మత్తుతో యువత చిత్తు

మత్తుతో యువత చిత్తు
  • విచ్చలవిడిగా మత్తు పదార్థాల రవాణా
  • విదేశాల నుంచి విమానాల ద్వారా తరలింపు
  • నెలలోనే 97.5 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌, జూన్‌ 23 (నమస్తే తెలంగాణ): మత్తుమాఫియా రెచ్చిపోతున్నది. పోలీసుల కన్నుగప్పి కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను విదేశాల నుంచి దేశంలో కుమ్మరిస్తున్నది. యువతను బానిసను చేసి కోట్ల రూపాయలు దేశం దాటిస్తున్నది. కండ్లముందే అంతా జరుగుతున్నా డ్రగ్స్‌ ఎవరు, ఎక్కడి నుంచి, ఎక్కడికి పంపుతున్నారు? అనే ప్రశ్నలకు సమధానం దొరకడం లేదు. డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడుతున్నవారు పాత్రధారులుగానే మిగులుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెలలో రూ.97.5 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుబడింది. 6న 12 కిలోలు, సోమవారం రూ.19.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు పట్టుకొన్నారు. హైదరాబాద్‌తోపాటు చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లోని విమానాశ్రయాల్లో కలిపి రూ.300 కోట్ల విలువైన 53 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. లాక్‌డౌన్‌ వల్ల రోడ్డు, జల మార్గాల ద్వారా డ్రగ్స్‌ తరలించటం కష్టంగా మారటంతో డ్రగ్స్‌ మాఫియా విమానాలను ఎంచుకుంటున్నది. డ్రగ్స్‌ తీసుకొస్తూ పట్టుబడిన ఆఫ్రికన్లు వారిదేశాల్లో రోడ్లపక్కన దుస్తుల విక్రయం, మరికొందరు చిన్న ఉద్యోగాలు చేసుకునేవారని దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి. డబ్బు ఆశచూపి వీరిని పావులుగా మార్చుకుంటున్నట్టు తేలింది. విజిటింగ్‌ వీసాలు, మెడికల్‌ వీసాలపై కొంత లగేజీని ఇచ్చి వాటిలో అనుమానం రాకుండా మత్తు పదార్థాలు ఉంచి పంపుతున్నారు. వీరికి ఫలానా ప్రాంతానికి వెళ్లాలనే చెప్తారు. అక్కడికి వచ్చి సరుకు తీసుకెళ్లే ముఠా మరొకటి ఉంటుంది. వారికి వీరికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. అంతా ఫోన్లలోనే జరిగిపోతుంది. అందుకే డ్రగ్స్‌ తెస్తున్న పెడ్లర్లను పట్టుకోగలుగుతున్నా అసలు సూత్రధారులను, ఎవరికి సరఫరా చేయబోతున్నారన్న లింక్‌ మాత్రం దొరకటం లేదు. డ్రగ్స్‌తో దొరికిపోయినవాళ్లు మాత్రం ఏండ్లకొద్దీ జైళ్లలో మగ్గాల్సి వస్తున్నది.

రూ. కోట్లలో డ్రగ్స్‌ పట్టివేత

  • ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్‌లో 100కోట్లకు పైగా విలువైన డ్రగ్స్‌ సరఫరా కేసులో పోలీసులు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. మూలాలన్నీ హైదరాబాద్‌తో ఉండడంతో ఇక్కడా దర్యాప్తు కొనసాగుతుంది.
  • ఈ ఏడాది ఏప్రిల్‌ 20న కేరళ సమీపంలో అరేబియా మహాసముద్రంలో నౌకాదళ సిబ్బంది రూ.3 వేల కోట్ల విలువైన మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి తరలిస్తున్నట్టు గుర్తించారు.
  • 2019 సామాజిక న్యాయశాఖ నివేదిక ప్రకారం ఏపీలో 69వేల మంది డ్రగ్స్‌కు బానిసలు కాగా, తెలంగాణలో 64వేల మంది ఉన్నారు.
  • 2017 నుంచి 2019 మధ్య దేశంలో 2,300 మంది మత్తుపదార్థాల కు బానిసలై మృతిచెందినట్టు ఎన్‌సీఆర్బీ నివేదిక వెల్లడించింది. వీరిలో 784 మంది 30 నుంచి 45 ఏండ్ల లోపువారే కావటం గమనార్హం.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మత్తుతో యువత చిత్తు
మత్తుతో యువత చిత్తు
మత్తుతో యువత చిత్తు

ట్రెండింగ్‌

Advertisement